తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క ఓటు ఆధిక్యం... సర్పంచ్​గా 22 ఏళ్ల యువతి! - దిబ్బపాలెం సర్పంచ్ అప్​డేట్

22 ఏళ్ల యువతి ఏం చేస్తుంది.. మహా అయితే డిగ్రీ పూర్తి చేసి.. ఉన్నత చదువులు చదువుతుంది. లేదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంది.. అంతే కదా.. అనుకుంటారు. కానీ ఓ యువతి 22 ఏళ్లకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైంది. గ్రామానికి సేవ చేసేందుకే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానంటోంది.

ఒక్క ఓటు ఆధిక్యం... సర్పంచ్​గా 22 ఏళ్ల యువతి!
ఒక్క ఓటు ఆధిక్యం... సర్పంచ్​గా 22 ఏళ్ల యువతి!

By

Published : Feb 11, 2021, 8:10 PM IST

ఒక్క ఓటు ఆధిక్యంతో 22 ఏళ్ల యువతి సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంది. ఈ ఆసక్తికరమైన ఘటన ఏపీ విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెంలో జరిగంది. దిబ్బపాలెం పంచాయతీ సర్పంచి పదవికి... గ్రామానికి చెందిన తుంపాల నిరంజని, నందారపు కాసులమ్మ పోటీ చేశారు.

ఎన్నికల్లో నిరంజనికి 721 ఓట్లు రాగా... ప్రత్యర్థి నందారపు కాసులమ్మకు 720 ఓట్లు వచ్చాయి. 42 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటు తేడా రావటం వల్ల అధికారులు పలుమార్లు లెక్కింపు చేపట్టారు. చివరికి అదే మెజారిటీ రాగా... తుంపాల నిరంజని సర్పంచిగా గెలుపొందినట్లు ప్రకటించారు.

డిగ్రీ చదువుకున్న నిరంజని... 22 ఏళ్లకే సర్పంచి పదవి దక్కించుకున్నారు. గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో 22 ఏళ్లకే రాజకీయల్లోకి వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో.. సర్పంచిగా సేవ చేస్తానని చెప్పారు.

ఇదీ చూడండి:'సాగర్​ ఉపఎన్నికతోనే తెరాస ప్రభుత్వ పతనం'

ABOUT THE AUTHOR

...view details