Municipal Commissioners Transferred In Telangana : రాష్ట్రంలోని పురపాలక శాఖలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాలు సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 22 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయం నుంచి బి.గీత రాధికను జీహెచ్ఎంసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో సంయుక్త సంచాలకులుగా టి.కృష్ణమోహన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
బడంగ్ పేట మున్సిపల్ కమిషనర్‌గా బి. సుమన్ రావును, రామగుండం కమిషనర్‌గా సీహెచ్. నాగేశ్వర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. మీట్పేట కమిషనర్‌గా ఏ.వాణి, ఖమ్మం కమిషనర్‌గా బి.సత్యనారాయణరెడ్డిని, మిర్యాలగూడకు ఎంపీ పూర్ణచందర్ రెడ్డిని బదిలీ చేశారు. నందికొండకు కే.వేణుగోపాల్‌ను, పోచారం కమిషనర్‌గా పీ.వేమన్‌రెడ్డిని బదిలీ చేసి.. రామగుండం డిప్యూటీ కమిషనర్‌గా ఆర్.త్రయంబకేశ్వర్‌ను నియమించింది. దమ్మాయిగూడ కమిషనర్‌గా ఎస్.రాజమల్లయ్యను బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం కమిషనర్ మహ్మద్ యూసఫ్‌ను పదోన్నతిపై జీహెచ్ఎంసీకి తరలించింది.
Municipal Commissioners Transferred : పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ.. తుర్కయాంజల్ కమిషనర్‌గా నియమించింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కే.నారాయణరావును బదిలీ చేయగా.. దమ్మాయిగూడ కమిషనర్ ఏ స్వామికి ఉద్యోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. జీ.రాజేంద్ర కుమార్ నగరం కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్ కమిషనర్ ఏ.సురేశ్‌ను జీహెచ్ఎంసీకీ, అలాగే ఎండీ సాబీర్ అలీని ఘట్కేసర్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. మిర్యాలగూడ కమిషనర్ పీ రవీంద్ర సాగర్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేసింది. హుస్నాబాద్‌కు ఆర్.రాజశేఖర్‌ను, ఏ.వెంకటేశ్‌ను కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్‌గా.. పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.