తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో 22 కరోనా అనుమానిత కేసులు - corona suspected cases news in ap

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కలిగిన కేసులు 22 నమోదయ్యాయి. ఇప్పటివరకు 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. 90 కేసులు నెగెటివ్‌గా వచ్చినట్లు నివేదిక రాగా...ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

22-corona-suspected-cases-in-ap
ఆంధ్రప్రదేశ్​లో 22 కరోనా అనుమానిత కేసులు

By

Published : Mar 18, 2020, 11:54 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కలిగిన కేసులు 22 నమోదయ్యాయి. విశాఖలో 5, కాకినాడలో 2, ఏలూరులో ఒకటి, నెల్లూరులో 5, చిత్తూరు జిల్లాలో 5, ఇతర చోట్ల ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. గడచిన 12 గంటల్లో... చిత్తూరు జిల్లాలో ఇద్దరు అనుమానిత లక్షణాలతో చేరారు. వైరస్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. 90 నెగెటివ్‌గా తేలాయి. మరో 9 కేసుల నివేదికలు రావాల్సి ఉంది.

నెల్లూరులో ఒక పాజిటివ్ కేసు..

నెల్లూరులో ఇప్పటికే ఒక పాజిటివ్ కేసు వచ్చింది. కాకినాడ బోధనాసుపత్రిలో కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలను ఒకట్రెండు రోజుల్లో చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి స్విమ్స్‌, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయి.

విద్యాసంస్థలకు సెలవులు!

కరోనా నివారణ దృష్ట్యా... ఏపీలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, వేసవి శిక్షణ శిబిరాలను మూసివేయాలని... ఉత్తర్వులు జారీచేసే విషయమై ఆయా శాఖల మధ్య చర్చలు జరిగాయి.

ఇదీ చూడండి:దిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..

ABOUT THE AUTHOR

...view details