తెలంగాణలో మరో 2,154 కరోనా కేసులు, 8 మంది మృతి - తెలంగాణ కొవిడ్ కేసుల తాజా అప్డేట్స్
06:57 October 07
తెలంగాణలో మరో 2,154 కరోనా కేసులు, 8 మంది మృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 2,154 కొవిడ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,04,748కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,189 మంది మృతి చెందారు. వైరస్ నుంచి కోలుకుని మరో 2,239 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 1,77,008 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 21,864 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 303 మంది వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 205, మేడ్చల్ జిల్లాలో 187 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 124, ఖమ్మం జిల్లాలో 121 మంది కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చదవండిఃఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన నెహ్రు జూలాజికల్ పార్క్