తెలంగాణలో మరో 2,103 కరోనా కేసులు, 11 మరణాలు
09:23 September 30
తెలంగాణలో మరో 2,103 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 91 వేలు దాటాయి. కొత్తగా 2,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,386కు పెరిగింది. మరో 11 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1,127కు చేరింది.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,243 మంది కోలుకోగా.. మొత్తం వైరస్ను జయించిన వారి సంఖ్య 1,60,933కి చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298 మందికి వైరస్ సోకగా... మేడ్చల్ జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లాలో 172, నల్గొండ జిల్లాలో 141, కరీంనగర్ జిల్లాలో 103, భద్రాద్రి జిల్లాలో 102 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి :డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆక్రమించుకున్న గ్రామస్థులు