ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44, 709 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 210 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారితో గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది.
ఏపీలో కొత్తగా 210 కరోనా కేసులు - corona death toll in ap news
ఏపీలో కొత్తగా 210 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది.
ఏపీలో కొత్తగా 210 కరోనా కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7, 180కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 140 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8, 82, 981కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1, 227 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1, 44, 48, 650 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:అసెంబ్లీలో రోజుకు రెండుసార్లు శానిటైజేషన్, మాస్క్ తప్పనిసరి