తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 21, 041 ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు' - దరఖాస్తుల స్వీకరణ అడ్వాన్స్ ఫీజు ఎల్​ఆర్​ఎస్

రాష్ట్రంలో అనుమ‌తుల్లేని, అన‌ధికార ఫ్లాట్లు, లే అవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. బుధ‌వారం 7 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 వేల 41 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వ‌చ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

'రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 21 వేల 41 ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు'
'రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 21 వేల 41 ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు'

By

Published : Sep 9, 2020, 10:25 PM IST

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మొత్తం 21 వేల 41 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వ‌చ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ అడ్వాన్స్ ఫీజుల రూపంలో రూ. 2.14 కోట్ల రూపాయ‌లు స‌ర్కార్ ఖాజానాలో జమ అయ్యాయని పేర్కొంది.

మున్సిపాలిటీల నుంచే అధికంగా..

దరఖాస్తుల్లో అత్యధికంగా మున్సిపాలిటీల నుంచి వచ్చినట్లు స్పష్టం చేసింది. పురపాలిక సంఘాల నుంచి 9 వేల 261, గ్రామ పంచాయతీల నుంచి 6 వేల 641, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 5 వేల 139 దరఖాస్తులు వచ్చినట్లు వివరించింది.

ఇవీ చూడండి : మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్‌ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details