హైదరాబాద్‌లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో బుధవారం అత్యధికంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిజాంపేట్‌లోని వివిధ అపార్టుమెంట్లలో 4 కేసులు నమోదవగా... గాజులరామరం పరిధిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కుత్బుల్లాపూర్‌లో కరోనా కలకలం... 21 కేసులు నమోదు - హైదరాబాద్‌లో కరోనా కేసులు
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒక్కరోజే ఏకంగా 21 మందికి పాజిటివ్ అని తేలగా... స్థానికులంతా ఆందోళనకు గురవుతున్నారు.
21 positive cases in kutbullapur constituency
జీడీమెట్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 5 కేసులు నమోదవగా... సుచిత్రలో ముగ్గురు కొవిడ్ బారిన పడ్డారు. చింతల్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇవే కాక.. నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో మరో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.