ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402కు చేరింది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు 21 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 14 మందికి వైరస్ సోకినట్లు వెల్లడించింది. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 72 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 82కు చేరింది. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. కడప జిల్లాలో ఆ సంఖ్య 30గా ఉంది.
ఏపీలో 400 దాటిన కరోనా పాజిటివ్ కేసులు - corona in ap
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు 21 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 402కు చేరింది.
ఏపీలో 400 దాటిన కరోనా పాజిటివ్ కేసులు