తెలంగాణలో మరో 2,072 కరోనా కేసులు, 9 మరణాలు - తెలంగాణ తాజావార్తలు
08:48 September 29
తెలంగాణలో మరో 2,072 కరోనా కేసులు, 9 మరణాలు
తెలంగాణలో తాజాగా 2,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. సోమవారం ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,116కి చేరింది.
వైరస్ బారి నుంచి సోమవారం 2,259 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,58,690కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,934 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 29,40,642కి చేరింది.
ఇదీ చూడండి:కరోనా నిర్ధారణకు చౌకైన, వేగవంతమైన పరీక్ష