TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు - telangana varthalu
18:40 June 05
TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం ఐదున్నర నుంచి ఈ సాయంత్రం ఐదున్నర గంటల వరకూ.. లక్షా 38 వేల 182 పరీక్షల ఫలితాలు రాగా.. 2వేల 70 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 18 మంది మరణించారు.
తాజాగా మహమ్మారి నుంచి 3 వేల 762 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 29 వేల 208 క్రియాశీల కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 245 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. ఖమ్మం జిల్లాలో 172, నల్గొండ జిల్లాలో 156, భద్రాద్రి కొత్తగూడెంలో 120 కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి