ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 80,641 మంది నమూనాలు పరీక్షించగా.. 2,068 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,127 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 21,198 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది.
AP CORONA CASES: కొత్తగా 2,068 కరోనా కేసులు.. 22 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 80,641 పరీక్షలు నిర్వహించగా.. 2,068 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,64,117 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
AP CORONA CASES: కొత్తగా 2,068 కరోనా కేసులు.. 22 మరణాలు
కొవిడ్ కారణంగా.. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందగా.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.