రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు, 11 మంది మృతి - today cases in telangana
08:27 September 18
రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు, 11 మంది మృతి
రాష్ట్రంలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా మరో 2,043 పాజిటివ్ కేసులు నిర్ధరణ కాగా... మెుత్తం కేసుల సంఖ్య 1,67,046కి ఎగబాకింది.
కరోనాతో మరో 11 మంది మరణించగా... మెుత్తం మృతుల సంఖ్య 1,016కు చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 314 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి ఇవాళ మరో 1,802 మంది కోలుకోగా... మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 1,35,357కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసోలేషన్‌లో మరో 24,081 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.