రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,91,118 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,574 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 253 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో 2 లక్షల 91వేలు దాటిన కరోనా బాధితులు - covid 19 Latest News
తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 91 వేల 118 మంది కొవిడ్ బాధితులున్నారు.
రాష్ట్రంలో 2 లక్షల 91వేలు దాటిన కరోనా బాధితులు
ఇప్పటివరకు 2,85,102 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,442 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,541 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 48 కరోనా కేసులు నమోదయ్యాయి.