KTR old Pic Viral: మంత్రి కేటీఆర్... సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా... ముఖ్యంగా ట్విటర్ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై సెటైర్స్‌తో పాటు.. అప్పుడప్పుడూ ఫాలోవర్స్‌తో #ASKKTR లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా కేటీఆర్.. ఓ ఫోటోను షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
20 ఏళ్ల క్రితం నాటి ఫోటోను... ఇప్పటి ఫోటోను కలిపి కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. దానికి 20 ఇయర్స్ ఎగో... అండ్ నౌ, థ్రో బ్యాక్ అంటూ... హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్స్... కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.