తెలంగాణ

telangana

ETV Bharat / state

BEGGAR FREE CITY: మాటలకే పరిమితమవుతున్న యాచకరహిత నగరం - telangana top news

పని చేయగలిగే శక్తి ఉన్నా కొందరు యాచిస్తూ బతకడానికే ఇష్టపడుతున్నారు. రోజూ దాదాపు 1000 రూపాయలు వస్తుండటంతో ఆ వృత్తిని వదలలేకపోతున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 20 వేలకు పైగా యాచకులున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

20-thousand-above-beggars-are-there-in-hyderabad
మాటలకే పరిమితమవుతున్న యాచకరహిత నగరం

By

Published : Aug 10, 2021, 9:17 AM IST

Updated : Aug 10, 2021, 10:07 AM IST

అధికారుల నోట ఏటా యాచక రహిత నగరం ప్రస్థావన వస్తున్నా అది మాటలకే పరిమితమవుతోంది. నగరంలో ఇరవై వేలకు పైగా యాచకులున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీరిలో అధికారులు పనిచేయగలిగిన శక్తి ఉండి యాచిస్తున్నవారే. ఓ గ్రూపుగా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. ముఠాల విషయంలో రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసి.. చర్యలు చేపట్టినా మళ్లీ దందా నడిపిస్తున్నారు. ముగ్గురు బాలికలను ఈ వృత్తిలోకి దింపి దందా కొనసాగిస్తున్న రమణమ్మను ఆబిడ్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక్కొక్కరూ రోజుకు రూ.వెయ్యి సంపాదించి ఇస్తే.. వారికి ఆమె రూ.300 చెల్లించేది. పాతబస్తీ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, ఎంజీబీఎస్‌, కోఠి, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో ఇలాంటి వారే కనిపిస్తుంటారు.

హడావుడి కొన్నాళ్లే..

2017లో ఇవాంక ట్రంప్‌ నగరానికి వచ్చిన సందర్బంలో యాచక రహితంగా మార్చారు. దాదాపు 150 మందిని చర్లపల్లి జైలుకు, మరో 400 మందిని చంచల్‌గూడ ఆనందాశ్రమానికి తరలించారు. తర్వాత నిర్వహణ భారమై వదిలేశారు. 2019లో ఈ పునరావాస కేంద్రాల్ని పూర్తిగా ఎత్తేశారు.

లెక్కకు సరిపోని కేంద్రాలు..

గ్రేటర్‌లో 20 వేల మంది యాచకులకు ప్రస్తుతం 14 మాత్రమే వసతి గృహాలున్నాయి. కేవలం వందల మందికే ఆశ్రయమిస్తున్న వాటిల్లో అన్నీ నిర్వహణ లోపాలే.

ఇదీ చూడండి:KRMB, GRMB: 'గెజిట్​లోని అభ్యంతరాలపై కేంద్రాన్ని సంప్రదించండి'

Last Updated : Aug 10, 2021, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details