శీతాకాల స్టడీ టూర్‌లో భాగంగా ఇవాళ, రేపు 2019 బ్యాచ్‌కు చెందిన 20 మంది ఐఏఎస్ ట్రైనీలు జీహెచ్‌ఎంసీలో పర్యటిస్తున్నారు. బల్దియాలో అమలు చేస్తున్న పథకాలపై వారికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగరాన్ని ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా విభజించినట్లు పేర్కొన్నారు. ఆస్తిపన్ను అంశాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు 11లక్షల మొబైల్ నెంబర్లకు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్లు స్పష్టం చేశారు. ఆస్తులను జియోట్యాగింగ్ చేసినట్లు వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం - Trainee ias Officers in Hyderabad
భారత్ దర్శన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 20మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ రాజధాని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. వారికి జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై కమిషనర్ లోకేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
![జీహెచ్‌ఎంసీలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం 20 Members of Trainee IAS Tour in GHMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5778424-101-5778424-1579530555523.jpg)
2డి బేస్ మ్యాపింగ్ ద్వారా ఆస్తిపన్నును ఆన్‌లైన్ సిస్టంలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించుటకై మైట్రో రైలు, అండర్ పాస్‌లు, స్కైవేల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరణకు దేశంలోనే మొదటి సారి స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టిన ఘనత హైదరాబాద్ నగరానికే చెందుతుందని తెలిపారు.
ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'