దిశ అమానవీయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయటంతో పాటు యువతులు, మహిళల భద్రతపై అవగాహన నేర్పింది. ఆపద సమయాల్లో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసేకన్నా ముందుగా ‘హాక్ ఐ’ మొబైల్ అప్లికేషన్‌లోని ఎస్‌ఒఎస్(సేవ్ అవర్ సోల్) మీటను నొక్కితే చాలు అంటూ పోలీస్‌శాఖ ప్రచారం చేయడం సత్ఫలితాలనిచ్చింది. కేవలం రెండు రోజుల్లో 2.5 లక్షల మొబైల్స్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ హత్యోదంతం తర్వాతే ఈ సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుందని డీజీపీ కార్యాలయం పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వారిలో 70 శాతం మంది రాజధాని వాసులేనన్నారు.
భారీగా డౌన్‌లోడైన 'హాక్–ఐ' - భారీగా డౌన్‌లోడైన 'హాక్–ఐ'
అత్యవసర సమయాల్లో అతివలకు హాక్ ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. దిశ హత్యోదంతం తర్వాత చాలామంది ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. పగలు, రాత్రితో సంబంధం లేకుండా పనిచేసే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు.
పిల్లలు సహా యువకులు, విద్యార్థినులు, మహిళలు డయల్ 100కు ఫోన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 50 వేల మంది డయల్ 100ను సంప్రదిస్తుండగా... నాలుగైదు రోజుల నుంచి ఫోన్లు చేసేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. శని, ఆది, సోమవారాల్లో రోజుకు సగటున 80వేల మంది డయల్ 100కు ఫోన్ చేశారు. అంటే 30వేల కాల్స్ పెరిగాయి. దీంతో మరో ఐదుగురిని ఫోన్ కాల్స్ స్వీకరించేందుకు అదనంగా నియమించారు. డయల్ 100కు వస్తున్న ఫోన్‌కాల్స్‌ను పోలీసులు ఎప్పటికప్పుడు విశ్లేషించి సంఘటనా స్థలాలకు వెళ్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.