ఈ నెల 19 రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెని ఉద్ధృతం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భేటీలో కో కన్వీనర్ థామస్‌రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు చేపట్టనున్న పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారు. ఈ భేటీకి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
ఆర్టీసీ సమ్మె: ఈనెల 13 నుంచి 19 వరకు నిరసన కార్యక్రమాలు - TSRTC STRIKE NEWS
ఆర్టీసీ సమ్మెను మరితం ఉద్ధృతం చేసేలా అఖిలపక్షం కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 19 న రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. 13 నుంచి 19 వరకు పలు కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారు.
19TH STATE BANDH DECIDED FOR TSRTC STRIKE
ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ...
- 13వ తేదీన వంటావార్పు
- 14న అన్ని డిపోల ముందు బైటాయింపు-బహిరంగ సభలు
- 15 న రాస్తారోకోలు-మానవహారాలు
- 16 న జేఏసీకి మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు
- 17న ధూంధాం కార్యక్రమాలు
- 18న బైక్ ర్యాలీలు
- 19న రాష్ట్ర బంద్
ఇదీ చూడండి: సైనైడ్ 'జాలీ'కి 7 రోజులు పోలీస్ కస్టడీ
Last Updated : Oct 12, 2019, 6:42 PM IST