చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించిన 1998 మెగా డీఎస్సీ అవినీతి, అక్రమాల పుట్టగా మారిందని 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. అప్పటి విద్యాశాఖలో కొంతమంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై టీచరు పోస్టుల నియామకాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.
న్యాయం చేయాలని కోరిన డీఎస్సీ 1998 అభ్యర్థులు - న్యాయం చేయాలని కోరిన డీఎస్సీ 1998 అభ్యర్థులు
డీఎస్సీ–1998 పూర్తయి 21 ఏళ్లు గడిచిపోయాయి. ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఇన్నేళ్లుగా న్యాయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సంక్రాంతి పండుగ లోపు సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
న్యాయం చేయాలని కోరిన డీఎస్సీ 1998 అభ్యర్థులు
ప్రగతి భవన్ సాక్షిగా డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... సంక్రాంతి పండుగ లోపు మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషనర్లకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. 21 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని... గతంలో కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వాలు అమలు చేయలేట్లదని వాపోయారు.
ఇదీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు
TAGGED:
1998 Dsc Candidates On Kcr