తెలంగాణలో మరో 1967 కరోనా కేసులు.. 9 మంది మృతి
09:13 September 27
రాష్ట్రంలో మరో 1967 కరోనా కేసులు.. 9 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,85,833కు చేరింది. వైరస్‌తో మరో తొమ్మిది మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1100కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,234 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. హోం ఐసోలేషన్‌లో 24,607 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
కొవిడ్ నుంచి ఇప్పటి వరకు 1,54,499 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 83.13 శాతానికి పెరిగింది. మరణాల రేటు 0.59 శాతానికి తగ్గింది. జీహెచ్‌ఎంసీలో మరో 297 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 147, మేడ్చల్ 137, కరీంనగర్ 152, నల్గొండ జిల్లాలో 105 కేసులు నమోదయ్యాయి.