రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య - corona possitive cases updates telangana
22:27 July 03
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 8 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 283కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని మరో 1,126 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటివరకు 10,195 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఆస్పత్రుల్లో 9,984 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,658 కరోనా కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్ 44, వరంగల్ గ్రామీణ జిల్లాలో 41 కేసులు బయటపడగా... సంగారెడ్డి 20, నల్గొండ 13, మహబూబ్‌నగర్ జిల్లాలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్ 7, రాజన్న సిరిసిల్ల 6, కామారెడ్డి జిల్లాలో 6 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఇవీ చూడండి:'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజే 6వేలమందికి వైరస్
TAGGED:
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం