తెలంగాణ

telangana

ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ - తెలంగాణ కరోనా వైరస్​ వార్తలు

రాష్ట్రంలో.... కరోనా కేసుల సంఖ్య 22 వేలు దాటింది. శనివారం అత్యధికంగా 1,850 మందికి వైరస్‌ నిర్ధరణ అయినట్లు... వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మరో ఐదుగురి మృతితో మృతుల సంఖ్య 288కి చేరింది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. IAS అధికారుల కమిటీని ప్రభుత్వం రంగంలోకి దించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు చేయాలని నిర్ణయించింది సర్కారు.. అవసరమైన చోట 20 నుంచి 30 వేల వరకు చేయాలని సూచించింది.

coronavirus news
విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ

By

Published : Jul 5, 2020, 4:54 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,850 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 22,312 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,572 మందికి వైరస్‌ సోకింది. జిల్లాల్లోనూ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్గొండలో 10 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 8, ఖమ్మంలో 7, వరంగల్‌ గ్రామీణంలో ఆరు, మహబూబ్ నగర్, జగిత్యాల, సిద్దిపేటలో ఐదేసి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నలుగురికి వైరస్‌ సోకింది. రాజన్న సిరిసిల్ల, జనగామలో 3, గద్వాల్-2, నిర్మల్, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మెదక్‌ జిల్లాలో ఒక్కే కేసు నమోదైనట్టు...వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. శనివారం ఒక్కరోజే 6,247 మందికి పరీక్షలు నిర్వహించగా 1,850 మందికి........ కరోనా ఉన్నట్లు నిర్ధరించారు.

ఇదొక్కటే అనుకూలం..

కరోనా బాధితుల్లో దాదాపు 50 శాతం మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వివరించాయి. ఇప్పటివరకు మొత్తం 11, 537 మంది డిశ్చార్జి అయ్యారని... మరో 10,487 మంది చికిత్సలో ఉన్నారని పేర్కొన్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారికి హోం హైసోలేషన్‌లో ఉంచే చికిత్సా విధానం రాష్ట్రంలో మరింత మెరుగ్గా పనిచేస్తోందని తెలిపాయి.

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ... మందుల కొనుగోళ్లు, పరీక్షలు, పరికరాలు, పరీక్ష కిట్ల సమీకరణను పర్యవేక్షిస్తుంది. కరోనా కాంటాక్టు వ్యక్తులను గుర్తించడంతోపాటు... ఐసోలేషన్‌లోని వారిని పరిశీలించనున్నారు. వైరస్‌ తీవ్రత పెరుగుతున్నందున జీహెచ్‌ఎంసీలో విస్తృతంగా పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట 20 నుంచి 30 వేల పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

ఇదీ చూడండి:తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details