రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,798 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 1,30,430 మందికి పరీక్షల ఫలితాలు రాగా... ఈ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు.. 5,98,611కు పెరిగాయి.
రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు, 14 మంది మృతి - తెలంగాణ ఈరోజు కరోనా వార్తలు
18:53 June 10
రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు, 14 మంది మృతి
వైరస్ కారణంగా మరో 14 మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం మృతుల సంఖ్య 3,440కు చేరింది. వ్యాధి నుంచి కొత్తగా 2,524 మంది కోలుకోగా... ఇప్పటివరకూ 5,71,610 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,561 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ జిల్లాలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86, జీహెచ్ఎంసీ పరిధిలో 174, జగిత్యాల జిల్లాలో 39, జనగామ జిల్లాలో 15, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 40, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 18, కామారెడ్డి జిల్లాలో 7, కరీంనగర్ జిల్లాలో 91, ఖమ్మం జిల్లాలో 165, ఆసిఫాబాద్ జిల్లాలో 7, మహబూబ్ నగర్ జిల్లాలో 45, మహబూబాబాద్ జిల్లాలో 68, మంచిర్యాల జిల్లాలో 65, మెదక్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 95, ములుగు జిల్లాలో 37, నాగర్ కర్నూల్ జిల్లాలో 26, నల్గొండ జిల్లాలో 151, నారాయణ పేట్ జిల్లాలో 10, నిర్మల్ జిల్లాలో 11, నిజామాబాద్ జిల్లాలో 20, పెద్దపల్లి జిల్లాలో 88, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37, రంగారెడ్డి జిల్లాలో 107, సంగారెడ్డి జిల్లాలో 40, సిద్దిపేట జిల్లాలో 51, సూర్యాపేట జిల్లాలో 84, వికారాబాద్ జిల్లాలో 35, వనపర్తి జిల్లాలో 33, వరంగల్ రూరల్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 61, యాదాద్రి భువనగిరి జిల్లాలో 46 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు