ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపీలో 19,50,339 మంది వైరస్ బారినపడినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో ఏపీ వ్యాప్తంగా 14 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 13,223కి చేరింది.
ap corona cases: కొత్తగా 1,747 కరోనా కేసులు,14 మరణాలు - ap news
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 65,920 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రాలో 19,50,339 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ap corona cases
24 గంటల వ్యవధిలో 2,365 మంది బాధితులు కోలుకోవడంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,75,283 నమూనాలను పరీక్షించారు.
ఇదీ చూడండి:ICMR SERO SURVEY: రాష్ట్రంలో 60 శాతం మందిలో కొవిడ్ యాంటీ బాడీలు