తెలంగాణ

telangana

ETV Bharat / state

SRISAILAM DAM: శ్రీశైలం డ్యామ్‌కు మొదలైన కృష్ణమ్మ ప్రవాహం

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్​లో కృష్ణానదిలో శ్రీశైలం డ్యామ్​కు నీటి ప్రవాహం పోటెత్తింది.

శ్రీశైలం డ్యామ్‌కు 17,360 క్యూసెక్కుల ప్రవాహం
శ్రీశైలం డ్యామ్‌కు 17,360 క్యూసెక్కుల ప్రవాహం

By

Published : Jun 15, 2021, 7:17 AM IST

కృష్ణా నదిలో శ్రీశైలం డ్యామ్‌కు 17,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సోమవారం జలాశయంలో 37.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువున ఆలమట్టికి 3,205 క్యూసెక్కులు, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 3,743, జూరాలకు 13,655 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

జూరాలలో విద్యుత్​ ఉత్పత్తి అనంతరం దిగువకు 11,091 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలో సింగూరు జలాశయానికి 1,754 క్యూసెక్కులు, ఎల్లంపల్లి జలాశయానికి 1,467 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

ఇదీ చూడండి: Rains: అల్పపీడన ప్రభావం.. నేడూ రేపూ మోస్తరు వానలు

ABOUT THE AUTHOR

...view details