తెలంగాణ

telangana

ETV Bharat / state

అలీని ఫాలో అయిన దొంగలు.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది! - ద్విచక్రవాహనాల దొంగతనాలు

బైకులను చోరీ చేసి వేరే ప్రాంతాల్లో విక్రయిస్తోన్న ఐదుగురు దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇడియట్ సినిమా తరహాలో వీరు బైకులను తీసుకెళ్లబోయి దొరికిపోయారు. వారి వద్ద నుంచి 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు.

17-bikes-were-seized-by-hyderabad-west-zone-polices
అలీని ఫాలో అయిన దొంగలు.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!

By

Published : Sep 12, 2020, 11:26 PM IST

కొంతమంది దొంగలు సినిమాల్లో దొంగతనాలు ఎలా చేస్తున్నారో దాన్నే ఫాలో అవడానికి చూస్తారు. అయితే అలా చేసిన వారిలో కొంతమంది విజయం సాధించినా మరికొంత మంది మాత్రం ఫెయిల్ అయిపోతారు. ఇదే తరహాలో ఓ దొంగల ముఠా సినిమా ట్రెండ్​ని ఫాలో అవుదాం అనుకున్నారు. అచ్చం ఇడియట్ సినిమాలో అలీ ఏ విధంగా బైక్‌లను దొంగిలిస్తూ ఇసుక బస్తాలతో పోలీసులను బురిడీ కొట్టిస్తారో అదేవిధంగా ఐదుగురు దొంగలు బైకులను బీదర్‌కు తీసుకెళ్లి విక్రయించాలని ప్లాన్ వేశారు. కానీ అక్కడ అలీ పోలీసులకు చిక్కలేదు కానీ ఇక్కడ ఈ దొంగలు మాత్రం పోలీసుల చేతిలో అడ్డంగా దొరికిపోయారు.

పోలీసులు వారి వద్ద నుంచి 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్, నిజామాబాద్​లలో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా బార్కస్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న క్రైమ్ పోలీసులను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అభినందించారు.

ఇవీచూడండి:ఇద్దరు దొంగలు అరెస్ట్​... తొమ్మిది బైక్​లు స్వాధీనం..

ABOUT THE AUTHOR

...view details