తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మరో 1682 కేసులు - telangana state corona cases

1682 new corona cases registered in the state
కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మరో 1682 కేసులు

By

Published : Aug 18, 2020, 9:10 AM IST

Updated : Aug 18, 2020, 11:52 AM IST

07:36 August 18

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మరో 1682 కేసులు

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మరో 1682 కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం (17వ తేదీన) కొత్తగా మరో 1,682 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 93,937కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఒక్కరోజే కరోనాతో మరో 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 711కి చేరింది. తాజాగా 2,070 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 72,202కి చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,024 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 14,140 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. 

తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 235 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 166, మల్కాజిగిరి 106, ఆదిలాబాద్ 18, కొత్తగూడెం 27, జగిత్యాల 59, జనగామ 32, జయశంకర్ భూపాలపల్లి 19, గద్వాల 69, కామారెడ్డి 44, కరీంనగర్ 88,  ఖమ్మం 45, అసిఫాబాద్ 9, మహబూబ్‌నగర్ 32, మహబూబాబాద్ 13, మంచిర్యాల 79 , మెదక్ 36, ములుగు 17, నాగర్‌కర్నూల్ 30, నల్గొండ 38, నారాయణపేట 11, నిర్మల్ 27, నిజామాబాద్ 94, పెద్దపల్లి 59, సిరిసిల్ల 47, సంగారెడ్డి 18, సిద్దిపేట 47, సూర్యాపేట 39, వికారాబాద్ 7, వనపర్తి 23, వరంగల్ అర్బన్ 107, వరంగల్ రూరల్ 20, యాదాద్రి 21 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదీచూడండి: ప్రతి ప్రాణాన్నీ కాపాడాలి.. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి: కేసీఆర్‌

Last Updated : Aug 18, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details