రాష్ట్రంలో కొత్తగా 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 57,142కు చేరింది. తాజాగా కొవిడ్‌తో 9 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 480కి పెరిగింది. సోమవారం కరోనా నుంచి కోలుకుని 803 మంది డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,909కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,753 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు
07:48 July 28
రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ 113, నిజామాబాద్ 58, కరీంనగర్ జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.
హైకోర్టు అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బులిటన్ ఫార్మాట్‌ను కొత్త పంథాలోకి మార్చింది. 59 పేజీలతో కూడిన బులిటన్ విడుదల చేసింది.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'
Last Updated : Jul 28, 2020, 8:17 AM IST