ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,24,755 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,970కి చేరింది.
AP Corona Cases: కొత్తగా 1,608 కరోనా కేసులు.. 6 మరణాలు - ap covid cases
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 మంది నమూనాలు పరీక్షించగా 1,608 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు.

corona cases
తాజాగా మరో 1,107 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,95,666కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,72,29,781 నమూనాలను ఏపీ ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చూడండి:Corona cases in India: మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు