సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆరిఫా అనే 16 ఏళ్ల బాలికను దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మిస్టరీ: చదువుకోవడానికి ఇంటిపైకెళ్లి శవమై తేలింది! - crime news today
చిలకలగూడ వారాసిగూడలో రాత్రి తన ఇంటి భవనంపై చదువుకుంటున్న 16 ఏళ్ల బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలగూడ వారాసిగూడలో 16 ఏళ్ల బాలిక హత్య
సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రాత్రి బాలిక భవనంపై చదువుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి 12 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవీచూడండి: దావోస్లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం