రాష్ట్రంలో బీసీ కమిషన్ పునరుద్ధరణకు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కాలపరిమితి ముగిసి 16 నెలలు గడిచినా బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. అక్టోబర్ 26, 2019న నాటికే కాలపరిమితి ముగిసినా.. రాజ్యాంగబద్ధమైన కమిషన్ పునరుద్ధరణలో అలసత్వం ఎందుకని ప్రశ్నించారు.
దేశంలో కేవలం రాష్ట్రంలో మాత్రమే రాజ్యాంగ సవరణలను బేఖాతరు చేశారని విమర్శించారు. కమిషన్కు రాజ్యాంగ బద్దమైన అధికారాలు కల్పించకుండానే గత కమిషన్ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. 2017లో 123వ రాజ్యాంగ సవరణ, 2018లో 102వ రాజ్యాంగ సవరణలను పొరుగు రాష్ట్రాలైన.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలు చట్టాలుగా చేశాయని గుర్తు చేశారు.