తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి - తెలంగాణలో కరోనా కేసులు

22:06 July 15
తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 39,342కు చేరింది. కొవిడ్‌తో మరో 11 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 386కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని మరో 1,159 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,999 చేరింది. ప్రస్తుతం 12,958 కరోనా యాక్టివ్ కేసులుండగా... వీరు హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్నారు.
బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 796 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 212 కేసులొచ్చాయి. మేడ్చల్ జిల్లాలో 115, సంగారెడ్డి 73, నల్గొండ 58, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26, మహబూబ్‌నగర్ 21, పెద్దపల్లి 20, మెదక్ 18, జయశంకర్ భూపాలపల్లి 15, సూర్యాపేట 14, యాదాద్రి భువనగిరి జిల్లా, నిజామాబాద్ 13 చొప్పున, జనగాం 8, భద్రాద్రి కొత్తగూడెం 7, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6 చొప్పున, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 5 చొప్పన, ములుగు, గద్వాల్ జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.
ఇదీ చూడండి:టార్గెట్ సచిన్... కాంగ్రెస్ కీలక నిర్ణయం