రాష్ట్రంలో 2 లక్షల 37 వేలు దాటిన కరోనా కేసులు - Telangana corona CASES
08:40 October 30
రాష్ట్రంలో 2 లక్షల 37 వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,531 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 2 లక్షల 37 వేల 187 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ఆరుగురు మృతిచెందగా... మొత్తం 1,330 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,048 మంది కరోనాను జయించారు.
ఇప్పటివరకు కొవిడ్ నుంచి 2 లక్షల 17 వేల 401 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 456 యాక్టివ్ కేసులున్నాయి. 15, 425 మంది హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 293 కరోనా కేసులు నమోదయ్యాయి.