తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి - తెలంగాణలో కరోనా కేసులు

22:07 July 14
తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం మరో 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 37,745కు చేరింది. కొవిడ్‌తో 10 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 375కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని మరో 1,161 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 24,840కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,531 మంది బాధితులు హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 815 కరోనా కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 240 కేసులొచ్చాయి. మేడ్చల్ జిల్లాలో 97, సంగారెడ్డి 61, నల్గొండ 38, వరంగల్ అర్బన్ 30, కరీంనగర్ 29, మెదక్ 24, వికారాబాద్ 21 కామారెడ్డి 19, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 19 చొప్పున, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక