Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ - TSPSC Latest News
![Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ Health Assistant Posts Notification](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/1200-675-19102754-260-19102754-1690373538939.jpg)
17:05 July 26
Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
1520 Multipurpose Health Assistant Posts Notification : తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మరో 1520 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే 1800లు పైగా నర్సింగ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టిన సర్కారు.. తాజాగా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ విభాగంలో ఖాళీగా ఉన్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్లో పంచుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతుందని రాసుకొచ్చారు. అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇవీ చదవండి:
TAGGED:
TSPSC latest Notification