తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో దాచిన కిలోన్నర బంగారం మాయం.. కాల్ చేస్తే పనిమనిషి సెల్​ స్విచ్చాఫ్.. - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్​లో మరో భారీ చోరి వెలుగులోకి వచ్చింది. దాదాపు 1500 గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన ఎస్సార్ నగర్​లో జరిగింది. ఇంట్లోని పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Massive theft in sr Nagar hyderabad
భారీ చోరీ.. ఇంట్లో దాచిన 2కేజీల బంగారం మాయం

By

Published : Apr 4, 2023, 1:47 PM IST

హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి శాంతి బాగ్ కాలనీలోని సీత సరోవర అపార్ట్​మెంట్​లో భారీ చోరీ జరిగింది. సుమారుగా కిలోన్నర బంగారం, డైమండ్ నెక్లెస్​తో పాటు నగదును కూడా దొంగలు చోరీ చేసినట్లు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏప్రిల్​ 3వ తారీఖున మెడికవర్ హాస్పిటల్, శాంతి బాగ్ లైన్ లో నివాసం ఉంటున్న రామ్ నారాయణ ఇంట్లో బంగారం దొంగతనానికి గురైంది. సాయంత్రం 3-4 గంటల సమయంలో రామ్ నారాయణ భార్య తులసి దొంగతనం జరిగిందని గుర్తించింది. ఆమె తన వాష్​రూమ్​లో ఖాళీ నగలు పెట్టె కనిపించడంతో ఆందోళన చెందింది. వెంటనే అక్కడనుంచి పడక గదిలోకి వెళ్లి నగలు దాచిన అల్మారాలో వెతికింది. అక్కడ నగలు కనబడలేదు. డైమండ్ నెక్లెస్​తో పాటు 150 తులాల బంగారం పోయినట్లు గుర్తించింది. వెంటనే తులసి తన భర్తకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. తమ ఇంట్లో పని చేసే పనిమనిషి సునీత పైనే తమ అనుమానం ఉన్నట్లు ఎస్సార్ నగర్ పోలీసులకు ఆ దంపతులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదంతా పని మనిషి పనే: గత మూడు రోజులు క్రితం పనిలోకి చేరిన పని మనిషే ఈ చోరీకి పాల్పడి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగలు దోచుకెళ్లారు అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో పనిమనిషి కనిపించడం లేదని చెప్పారు. అనుమానం వచ్చి ఆమెకు ఫోన్ చేస్తే.. స్పిచ్చాఫ్​లో ఉందని బాధితులు తెలిపారు. దీంతో ఆమెనే బంగారాన్ని ఎత్తుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పని మనిషి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలోను: గతంలోను ఎస్సార్ నగర్​లో భారీ చోరి జరిగింది. ఎంతో నమ్మకంగా ఉంటూనే డ్రైవర్ రూ.7కోట్ల విలువైన బంగారు నగలను దోచుకెళ్లాడు. కస్టమర్ల ఆర్డర్ల మేరకు నగల దుకాణాల నుంచి నగలు ఆర్డర్ చేసి వారికి డెలివరీ చేస్తుంటారు. కొన్నిసార్లు డ్రైవర్ ద్వారా పంపించేవారు. అలా ఒక రోజు డ్రైవర్ ఆర్డర్ ఇవ్వాల్సిన 7 కోట్ల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. పని చేస్తున్న ఇంటికే కన్నం వేసి పారిపోయాడు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details