తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్టు 15 నుంచి హైదరాబాద్​లో 15 ప్రాంతాల్లో ప్లాస్మా రక్తదాన శిబిరం

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లోని 15 ప్రాంతాల్లో కొవిడ్-19 ప్లాస్మా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనన్నట్లు ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం ప్రతినిధి జబ్బార్ సయ్యద్ వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్​ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్​లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

15 places in hyderabad to start plasma donation camps
ఆగస్టు 15 నుంచి హైదరాబాద్​లో 15 ప్రాంతాల్లో ప్లాస్మా రక్తదాన శిబిరం

By

Published : Aug 13, 2020, 5:10 PM IST

కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న బాధితుల కోసం కొవిడ్-19 ప్లాస్మా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం తెలిపింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్​ ఆధ్వర్యంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లోని 15 ప్రాంతాల్లో క్యాంప్​ను ప్రారంభించనన్నట్లు ఫోరం ప్రతినిధి జబ్బార్ సయ్యద్ వెల్లడించారు.

ఆగస్టు 22 వరకు జరగనున్న రక్తదాన శిబిరానికి.. ప్లాస్మాదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. కరోనా వైరస్​తో కొట్టుమిట్టాడుతున్న బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేసేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాధితో కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేసి తోటి వారి ప్రాణాలు కాపాడాలన్నారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details