రాష్ట్రంలో కొత్తగా 1,456 కరోనా కేసులు, 5 మరణాలు - Number of corona cases in Telangana

08:29 October 22
రాష్ట్రంలో కొత్తగా 1,456 కరోనా కేసులు, 5 మరణాలు
రాష్ట్రంలో మరో 1,456 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580కు చేరింది. 1,292 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,717 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు2,06,105 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,977మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 254 కేసులు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 98 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.