రాష్ట్రంలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు - Telangana Corona Cases
08:42 October 17
రాష్ట్రంలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 14 వందల 51 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 20 వేల 675 మంది వైరస్ బారిన పడ్డారు. ఇటీవలి కాలంలో రికవరీల రేటు గణనీయంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. గడచిన 24గంటల్లో 19 వందల 83మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు లక్షా 96 వేల 636మంది వైరస్‌ను జయించారు. కొవిడ్‌తో మొత్తం 12 వందల 65 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం 22 వేల 774 యాక్టివ్ కేసులు ఉండగా.... అందులో 18 వేల 905 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 235 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మేడ్చల్‌లో 101, రంగారెడ్డిలో 104 కేసులు వెలుగుచూశాయి. ఖమ్మంలో 71 మందికి, కరీంనగర్‌లో 65 మందికి, సిద్దిపేటలో 64 మందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో చిన్నారుల్లో కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.