రాష్ట్రంలో 2 లక్షల 38 వేలు దాటిన కరోనా కేసులు - హైదరాబాద్ తాజా వార్తలు
09:02 October 31
రాష్ట్రంలో 2 లక్షల 38 వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 38 వేల 632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,336 మంది మృతిచెందారు. మరో 1,486 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు. 2,18,887 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 18,409 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 15,439 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 286 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 107 మంది వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లాలో 102, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 90 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.