నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు - నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం నేపథ్యంలో... ఆయన రాజకీయక్షేత్రం నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నేరుగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. 10 మంది డీఎస్పీలు, 14మంది సీఐలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 30 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
![నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4467406-697-4467406-1568713755611.jpg)
నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు