తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు.. ఆరు మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు
08:02 October 18
రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు.. 6 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,22,111కు చేరింది. వైరస్‌తో కొత్తగా ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,271కి పెరిగింది.
కొవిడ్ నుంచి తాజాగా 2,154 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటి వరకు 1,98,790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 18,279 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:మనస్సంకల్పానికి ప్రతీక.. మానసాదేవి అమ్మవారు