కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సర్కారు జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించింది. భాగ్యనగరంలో తెరిచి ఉంచిన 140 సంస్థలను సీజ్ చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంస్థలు తప్ప మిగతా సంస్థలన్నీ మూసివేయాలని ఆయన సూచించారు.
'భాగ్యనగరంలో 140 సంస్థలు సీజ్' - GHMC Enforcement Department
కరోనా వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన పలు సంస్థలపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్లో తెరిచి ఉంచిన 140 సంస్థలను అధికారులు సీజ్ చేశారు.
GHMC EV and DM
ప్రజలు ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, మార్కెట్స్, వాణిజ్య సంస్థల వద్ద కొవిడ్ -19 నివారణకు తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సందర్శకులకు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్ హెచ్చరించారు.
ఇదీ చదవండిః'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష