Engineering Seats in Telangana 2023 : ఇంజినీరింగ్ మొదటి విడత వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించింది. ఇదే క్రమంలో ఇంజినీరింగ్ విద్యలో మరో 14 వేల 565 సీట్లకు సర్కారు అనుమతిని ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. వివిధ కాలేజీల్లో కొత్తగా 7వేల 635 అదనపు సీట్లను మంజూరు చేసింది. ఇంజినీరింగ్ విద్యలో కీలక బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి కోర్ గ్రూపుల్లో 6 వేల 930 సీట్లను తగ్గించుకొని.. అదే సంఖ్యలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
సీట్లు పెంపు వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రభుత్వంపై ఏటా రూ.27 కోట్ల 39 లక్షలు అదనపు వ్యయభారం పడనుంది. ఇటీవలే 86 వేల 106 సీట్లకు జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. తాజా పెంపుతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 55 కాలేజీల్లో 45 కోర్సుల్లో లక్ష 671 సీట్లకు అనుమతి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో పదిశాతం సీట్లు కలిపి లక్ష పది వేల వరకు సీట్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి.
First Phase Of Engineering Web Options : వీటిలో సుమారు 60వేల సీఎస్‌ఈ కోర్సులే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ సీట్లు భారీగా తగ్గిపోగా.. సీఎస్‌ఈ, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సీట్లు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే ప్రారంభమైన ఇంజినీరింగ్ మొదటి విడత వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుండగా.. 12వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో మార్పులు: మరోవైపు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త సీట్ల అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో మార్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. శుక్లవారం, శనివారం ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇవ్వగా.. ఈనెల 9వ తేదీన ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12వరకు పొడిగించింది. అదే విధంగా ఈనెల 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.. 24 నుంచి రెండో విడత సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 4వ తేదీ నుంచి తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుంది.
ఇవీ చదవండి: