తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండోరోజూ విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే! - Second day students attendance percentage

తెలంగాణలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు రెండోరోజు కూడా విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తెలంగాణవ్యాప్తంగా 14 శాతం విద్యార్థులే బడులకు హాజరయ్యారు.

14 percent of students attended the second day of school in telangana
రెండోరోజూ విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే!

By

Published : Feb 25, 2021, 8:01 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో రెండోరోజూ విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే నమోదైంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిన్న 9శాతం హాజరుకాగా.. ఇవాళ స్వల్పంగా పెరిగి 14 శాతం విద్యార్థులు బడులకు హాజరయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 17శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 14శాతం హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ బడుల్లో 5లక్షల 47వేల 479 మందిలో 94వేల 244మంది.. ప్రైవేటు పాఠశాలల్లో 7 లక్షల 57వేల 319 మందిలో లక్ష 2 వేల 831 మంది హాజరయ్యారు. అత్యధికంగా నిజామాబాద్, నారాయణ పేట జిల్లాల్లో 28 శాతం... అతి స్వల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాల్లో 5శాతం విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details