ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలోని చీడికాడ మండలం తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 14 అడుగులకు పైగా పొడవున్న గిరినాగును ఆ ప్రాంత రైతులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ అధికారి ఎం.రమేష్కుమార్కి చెప్పడంతో ఆయన విశాఖలోని వన్యప్రాణి సంరక్షణ సమితి అధికారి మూర్తికి తెలిపారు. ఆయన హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న గిరి నాగును చాకచక్యంగా పట్టుకున్నారు. వాలాబు సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు రమేష్ కుమార్ వెల్లడించారు.
అమ్మో..14 అడుగుల పొడవైన గిరినాగు - india cobra in thangudubilli
ఒకటా..రెండా...ఏకంగా 14 అడుగుల పొడవైన గిరి నాగు అది. చిన్న చిన్న పాములకు హడలెత్తిపోతాం మనం. అటువంటిది ఈ పొడవైన గిరి నాగును చాకచక్యంగా పట్టుకోవటమే కాకుండా, సురక్షతంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడాయన. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోండి.
14 అడుగుల పొడవైన గిరి నాగు పట్టివేత