జయరాం హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డితోపాటు శ్రీనివాస్‌ను... పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జయరాం భార్య విజ్ఞప్తి మేరకు కేసును హైదరాబాద్ బదలాయించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రేపు నాంపల్లి కోర్టులో రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.