తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ మద్యం స్కామ్‌... శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లకు 14 రోజుల కస్టడీ - Delhi Liquor Scam Update

Delhi Liquor scam updates: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతనెల 17న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ లేఖ రాశారు. శరత్‌ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న జెట్ సెట్​ గో విమానయాన సంస్థ వివరాలను కోరింది.

Delhi Liquor Scam
దిల్లీ మద్యం స్కామ్‌

By

Published : Nov 21, 2022, 3:00 PM IST

Updated : Nov 21, 2022, 3:17 PM IST

14:55 November 21

దిల్లీ మద్యం స్కామ్‌... శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లకు 14 రోజుల కస్టడీ

దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీలాండరింగ్ అంశంలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు 14 రోజుల కస్టడీనిచ్చింది ధర్మాసనం. ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. జైలులో బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. బీపీ మందులు, చలి దుస్తులు, బూట్లు వాడేందుకు కోర్టు అనుమతినివ్వగా... జైలులో ఇద్దరికీ చికిత్స అందించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇక తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది.

ఇవీ చదవండి :

Last Updated : Nov 21, 2022, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details