తెలంగాణ

telangana

ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త... అటువెళితే మృత్యువుకు స్వాగతం పలికినట్టే! - hyderabad accident areas

ఫుట్‌పాత్‌ లేదు.. పాదచారులు రోడ్డు దాటేందుకు అవకాశం లేదు.. ఇష్టారీతిగా వాహనాల రాకపోకలు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. అతివేగం.. కూకట్‌పల్లి జేఎన్టీయూ మెట్రో పిల్లర్‌ 19 నుంచి 35 వరకు గల ప్రధాన మార్గాన్ని నిత్యం నెత్తురోడేలా చేస్తున్నాయి. మూడేళ్లలో అక్కడ 117 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఈ ఒక్కచోటే కాదు.. తరచూ రక్తసిక్తమవుతున్న మరో 14 అత్యంత ప్రమాదకర ప్రాంతాల(బ్లాక్‌ స్పాట్స్‌)ను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు.

black spots on hyderabad roads
black spots on hyderabad roads

By

Published : Jun 29, 2020, 12:47 PM IST

ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నివారణపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్​లో 2017, 2018, 2019లలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగాయంటూ ఆరా తీశారు. కేపీహెచ్‌బీ, ఆర్సీపురం, మియాపూర్‌, మాదాపూర్‌, మేడ్చల్‌, కూకట్‌పల్లి, రాయదుర్గం, మైలార్‌దేవ్‌పల్లి, బాలానగర్‌లోని 15 ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్స్‌గా తేల్చారు. ఇంజినీరింగ్‌, నిర్వహణ లోపాలతోపాటు డ్రంకెన్‌ డ్రైవ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగం, వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించడం, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఆయా చోట్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు.

రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు చర్యలు తీసుకుంటున్నాం

బ్లాక్‌స్పాట్స్‌లో జీహెచ్‌ఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లతో కలిసి ప్రత్యేక అధ్యయనం చేశాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ఆయా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాం. సూచిక బోర్డులు, ఇతర ఏర్పాట్లు చేశాం. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను తరచూ చేస్తున్నాం. నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం.

- ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

ప్రాంతం - రోడ్డు ప్రమాదాలు

  • మెట్రో పిల్లర్‌ నం. 19 నుంచి 35 వరకు (జేఎన్టీయూ) 117
  • గండమ్మ గుడి నుంచి భెల్‌ జంక్షన్‌ సమీపంలోని నాలా (ఎన్‌హెచ్‌ 65) 102
  • కేఎఫ్‌సీ నుంచి మెట్రో పిల్లర్‌ నం.1 (మియాపూర్‌) 88
  • ఫార్చ్యూన్‌ టవర్స్‌(సీవోడీ జంక్షన్‌) నుంచి కావూరి హిల్స్‌ (నీరూస్‌ జంక్షన్‌) 76
  • ఎస్‌బీఐ-ఐడీఏ బ్రాంచి నుంచి తిరుమల వే బ్రిడ్జి, మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ (ఎన్‌హెచ్‌ 44) 73
  • అంకుర ఆసుపత్రి (ఎదురుగా) నుంచి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌, మదీనగూడ 73
  • మెట్రో పిల్లర్‌ నం.1 (హైదర్‌నగర్‌) నుంచి 19 వరకు (జేఎన్టీయూ ఎక్స్‌ రోడ్డు) 71
  • సీజన్స్‌ బార్‌ నుంచి శ్రీసాయి కృపా బైక్‌ జోన్‌, మేడ్చల్‌ (ఎన్‌హెచ్‌ 44) 71
  • వీఆర్‌ బార్‌ నుంచి కేఎఫ్‌సీ మియాపూర్‌ వరకు 68
  • ఎన్‌కేఎన్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి అల్సాభా, మూసాపేట్‌ (ఎన్‌హెచ్‌ 65) వరకు 67
  • పక్వాన్‌ హోటల్‌(ఎదురుగా) నుంచి సైబరాబాద్‌ సీపీ కార్యాలయం, గచ్చిబౌలి 66
  • ఐవోసీ పెట్రోల్‌ పంపు, అశోక్‌ నగర్‌ నుంచి గండమ్మ గుడి, ఆర్సీపురం(ఎన్‌హెచ్‌ 65) 64
  • భారతినగర్‌ ఎక్స్‌ రోడ్డు (డంపుయార్డు) నుంచి నాగులమ్మ గుడి వరకు(ఎన్‌హెచ్‌ 65) 64
  • సూర్య దాబా నుంచి మైలార్‌దేవ్‌ పల్లి కాంప్లెక్స్‌ వరకు 64
  • బీబీఆర్‌ ఆసుపత్రి నుంచి ఎన్‌ఆర్‌ ఎస్‌ఏ, బాలానగర్‌ మెయిన్‌ రోడ్డు 63

ఇదీ చదవండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ABOUT THE AUTHOR

...view details